Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుమారుడి డైపర్స్ కోసం కోటిన్నర ఖర్చు చేస్తోన్న బాలీవుడ్ దంపతులు

  • సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల కుమారుడు తైమూర్ 
  • ఇంత చిన్న వయసులో ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్న బాలుడు
  • ఓ డైప‌ర్ కంపెనీతో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ డీల్
బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఇంత చిన్న వయసులో ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి ఫొటోలు పదే పదే వైరల్ అవుతుంటాయి. తమ ముద్దుల కుమారుడు తైమూర్ డైపర్ల కోసం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చేస్తోన్న ఖర్చుకు సంబంధించిన ఓ విషయం తాజాగా బయటకు వచ్చింది.

ఓ డైప‌ర్ కంపెనీతో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ కోటిన్న‌ర రూపాయ‌ల డీల్ కుదుర్చుకున్నారట. తైమూర్ కోసం ఆ కంపెనీ ప్ర‌త్యేకంగా డైప‌ర్లు తయారు చేసి ఇస్తోందట. ఆ బాలుడి కేర్ టేక‌ర్‌కు నెల‌కు ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల‌ను ఆ దంపతులు చెల్లిస్తుంటారు. కుమారుడిపై వారు చూపిస్తోన్న శ్రద్ధ హాట్ టాపిక్‌గా మారుతోంది.
Bollywood
New Delhi

More Telugu News